Saturday, March 14, 2026
E-PAPER
Homeసినిమా'ఆయా షేర్‌' కోసం భారీ సెట్స్‌

‘ఆయా షేర్‌’ కోసం భారీ సెట్స్‌

- Advertisement -

‘ది ప్యారడైజ్‌’ చిత్రంలోని ‘ఆయా షేర్‌’ పాట ఈ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. పలు భాషల్లో మిలియన్ల వ్యూస్‌ సాధించడంతో పాటు, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో వైరల్‌గా రీక్రియేట్‌ అవుతోంది. ఈ పాటలో చూపించిన ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు మేకర్స్‌ ఒక భారీ స్లమ్‌ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇందులో హీరోను స్లమ్‌ల సామ్రాట్‌లా చూపించేలా ప్రత్యేకంగా సెట్స్‌ రూపొందించారు. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల విడుదలైన ‘ఆయా షేర్‌’ పాట రా ఎనర్జీ, స్ట్రైకింగ్‌ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు వచ్చిన గ్రాండ్‌ లుక్‌ వెనుక ప్రధాన కారణం ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ రూపొందించిన అద్భుతమైన సెట్స్‌.

గ్రాండియర్‌తో పాటు సహజత్వాన్ని కలిపి ఈ సెట్స్‌ రూపొందించారు. అత్యంత ఆకట్టుకునే సెటప్‌లలో ఒకటి హీరో హౌస్‌ (కమాన్‌ సెట్‌). హీరో పవర్‌ఫుల్‌ డిప్‌ మోమెంట్‌ కోసం ప్రత్యేకంగా ఈ భారీ నిర్మాణాన్ని రూపొందించారు. వాటర్‌ బాడీ విలేజ్‌ సెట్‌ మరో హైలెట్‌. ఇది 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో డమ్మీ నిర్మాణాలు కాకుండా పూర్తిగా నిర్మించిన 60 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 50 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి ఈ గ్రామాన్ని నిర్మించారు. వాటర్‌ బాడీ, భారీ డంప్‌ యార్డ్‌ సెట్‌ కూడా నిర్మించారు. రియలిజం , సహజత్వం పెరగడానికి సహజ టెక్స్చర్లు, ఏజింగ్‌ టెక్నిక్స్‌ ఉపయోగించారు అని యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -