- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేటి నుంచి పది తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం 8:30కే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్‌వాచీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. అలాగే యూనిఫామ్ ధరించకూడదని అధికారులు స్పష్టం చేశారు.
- Advertisement -



