Saturday, March 14, 2026
E-PAPER
Homeఆటలుకేకేఆర్‌లోకి జింబాబ్వే స్టార్ పేసర్..

కేకేఆర్‌లోకి జింబాబ్వే స్టార్ పేసర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కేకేఆర్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేసి, అతడి స్థానంలో జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీతో ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 17న ముజారబానీ కోల్‌కతాలోని జట్టు క్యాంపులో చేరనున్నాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ఈ జింబాబ్వే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తన ఎత్తుకు తగ్గట్టే బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో సిద్ధహస్తుడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుతంగా రాణించాడు. టోర్నీలో మొత్తం 13 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ఐపీఎల్ అవకాశం కోసం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి కూడా వైదొలిగాడు. గత సీజన్‌లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిచిన జట్టులో ఉన్నప్పటికీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -