Saturday, March 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం మొదటి రోజున పదవ తరగతి  పరీక్షలు ప్రారంభించడంతో పరీక్ష కేంద్రాన్ని ప్లైయంగ్ స్క్వాడ్ సిద్ద పద్మ తో పాటు మండల తహసీల్దార్ శివరాజ్, ఎస్ ఐ శ్రీనివాస్ లు వేరు వేరుగా అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పరీక్ష కేంద్ర తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల పరీక్ష సరళిని పరిశీలించారు. పరీక్షలను పక్కడబందిగా నిర్వహించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రానికి నలుమూలలుగా  144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు చేపడతామని సూచించారు. వారి వెంట మండల విద్యాధికారి విజయ్ కుమార్ చీఫ్ సూపర్డెంట్లు డిపార్ట్మెంట్ అధికారి తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -