- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సందర్శించారు. 99 రోజుల ప్రజా పాలనా కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్, సిహెచ్‌వో సాగర్ రావు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



