నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ పార్టీ సోమవారం చేపట్టిన చలో పార్లమెంట్ యాత్రపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జీ చేసిన విషయం తెలిసిందే. శాంతియుతంగా జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు సాగుతున్న యువతను పోలీస్ బలగాలు అడ్డగించాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ తరహా చర్య సరైంది కాదని మండిపడ్డారు.
“యువత చేస్తున్న పనిలో ఏమాత్రం తప్పు లేదని, కానీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అత్యంత అసహ్యకరమైనది. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేయడం వంటివి ఏమాత్రం సరైన ప్రవర్తన కాదు, ఇది ప్రజాస్వామ్యయుత భారతీయ విధానం కాదు , ఇలా వ్యవహరించడం హేయమైన చర్య,” అని రాహుల్ గాంధీ సోషల్ మీడియ వేదికగా ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.



