Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమానత్వాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి

సమానత్వాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి

- Advertisement -

ప్రపంచ నీటి దినోత్సవం ఈసారి మహిళా సమనత్వానికి అంకితం
డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రపంచ నీటి దినోత్సవాలను ఈ సంవత్సరం మహిళల సమానత్వ హక్కులకు సూచికగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం నిర్వహించిన ప్రపంచ నీటి దినోత్సవ వారోత్సవ గోడ పత్రికను విడుదల చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఈనెల 22న జరిగే ప్రపంచ నీటి దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఈ సంవత్సరం మహిళల సమానత్వ హక్కులకు అంకితం చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మహిళా కళాశాల తరఫున వృక్షశాస్త్రం విభాగాధిపతి మౌనిక ఆధ్వర్యంలో ఈనెల 22 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచం నీటి కొరతను ఎదుర్కొంటుందని, దీనిని అధిగమించే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సుధా సింధు, అధ్యాపకులు మౌనిక, దీపిక, హీన, ప్రత్యూష, నవత, జాగృతి, సుమాంజలి పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -