మైనారిటీలకు సంక్షేమానికి ప్రజా పాలన ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
నవతెలంగాణ – మద్నూర్
మైనార్టీల సంక్షేమానికి ప్రజా పాలన ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ ను పురస్కరించుకొని మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ఆదుకుంటుందని తెలిపారు. ఈ ఈఫ్తార్ విందు కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, ముస్లిం నాయకులు జావిద్ పటేల్, వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య ముస్లిం నాయకులు, మద్నూర్ గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు సంతోష్ మేస్త్రి, తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



