Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు అప్రమత్తంగా..
పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన సహించేది లేదు..
జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్..
నవతెలంగాణ – మునుగోడు

పదవ తరగతి పరీక్షల సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులకు సౌకర్యాలలో నిర్లక్ష్యం వహించకుండా సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించిన సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట  తాసిల్దార్ నేలపట్ల నరేష్, మండల విద్యాశాఖ అధికారి టి మల్లేశం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -