Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలనీ సమస్యలపై కౌన్సిలర్ దృష్టి

కాలనీ సమస్యలపై కౌన్సిలర్ దృష్టి

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
వనపర్తి జిల్లా కేంద్రంలోని 28వ వార్డు వెంగళరావు కాలనీలో నెలకొన్న స్థానిక సమస్యలపై కౌన్సిలర్ కోట్ల శిరీష రవిలు దృష్టి సారించారు. వేసవి కాలం కావడంతో పలుచోట్ల వాటర్ లీకేజీలు, టాప్లు విరిగిపోవడం వంటి సమస్యలు కాలనీవాసులు కౌన్సిలర్ కోట్ల శిరీష రవి  దృష్టికి తీసుకొచ్చారు. దానితో వెంటనే స్పందిస్తూ సిబ్బందితో కొత్త ట్యాప్ లను వేయించి నీరు వృధా కాకుండా లీకేజీలను అరికట్టి సమస్యలను పరిష్కరించారు. శ్రీ వాణి కాలేజీ రోడ్డులో మురుగు కాలువ జామ్ కావడంతో నీరు కిందికి వెళ్ళక ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు కౌన్సిలర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో మురుగు కాలువలో పేరుకుపోయిన మట్టిని చెత్తాచెదారాన్ని వార్డు కౌన్సిలర్ కోట్ల శిరీష రవి దగ్గరుండి శుభ్రం చేయించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -