నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురు గొంతు కోసి దారుణ హత్య చేసింది తల్లి. కొడుకును కూడా కత్తితో గొంతు కోయడానికి యత్నం చేయగా తప్పించుకుని కేకలు వేశాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
బాబు కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వేంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితురాలైన రత్నకళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.
నిందితురాలు జైనపల్లి మాజీ సర్పంచ్ బెజ్జంగి నరేందర్ రెడ్డి భార్యగా సమాచారం. శనివారం రాత్రి అత్తారిల్లు బీబీనగర్ మండలం జైనపల్లి నుండి తుక్కాపురం అమ్మవారి ఇంటికి రత్నకళ వచ్చింది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



