నవతెలంగాణ – భిక్కనూర్
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వివిధ గ్రామపంచాయతీలలో గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికుల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు శిబిరాలు ఏర్పాటు చేసి సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివ్య శ్యామల, అయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతి కార్యదర్శులు, వైద్య సిబ్బంది మంజుల, మాధవి, రాజమణి, స్వరూప, హేమలత, యశోద, గ్రామాల ఆశా కార్యకర్తలు, పంచాయతి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పిహెచ్‌సి పరిధిలో కార్మికులకు వైద్య శిబిరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



