Sunday, March 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమా.. టీపీసీసీ చీఫ్ సవాల్

కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమా.. టీపీసీసీ చీఫ్ సవాల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన బృందం సమాధానం చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.  మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత సమాజం కోసమే ‘ఈగల్’ బృందం దాడులు చేస్తోందని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. “కేటీఆర్‌, ఆయన అనుచరులు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అవసరమైతే డ్రగ్స్‌ పరీక్షలకు కేటీఆర్‌ సిద్ధం కావాలి. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం పరీక్షలు చేయించుకుందాం” అని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నారని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోయిందని ఆరోపించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -