Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమర్ మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు

అమర్ మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలో సర్పంచ్ ముక్కెర విజయ్, మా ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం (హెల్త్ క్యాంపు) నిర్వహించారు. పట్టణంలోని అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు అమర్, శైలిజ, వినయ్ పాల్గొని గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో వైద్య నిపుణులు ప్రత్యేకంగా పాల్గొని వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. అలాగే ఎముకల (ఆర్థోపెడిక్) వైద్య నిపుణులు కూడా పాల్గొని ఎముకలు, సంధుల నొప్పులు వంటి సమస్యలపై రోగులను పరీక్షించి చికిత్స సూచనలు ఇచ్చారు.

శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా రక్తపోటు, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై వైద్య సేవలు పొందారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కెర విజయ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు గ్రామాల్లో నిర్వహించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు.

ఎంపీడీఓ గంగాధర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని, గ్రామస్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.డాక్టర్ అమర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం శుభ్రత పాటించాలని, ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏలేటి పద్మమోహన్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు రాంచందర్, నారగౌడ్, డాక్టర్ అరుణ, గంగాధర్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -