Monday, March 16, 2026
E-PAPER
Homeసినిమావిజువల్‌ ట్రీట్‌గా 'నమో..రే' పాట

విజువల్‌ ట్రీట్‌గా ‘నమో..రే’ పాట

- Advertisement -

విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా, నిక్‌ స్టూడియోస్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ కాంబోలో రూపొందుతున్న పాన్‌-ఇండియా చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘నమో రే’ పాట విడుదలైంది. దర్శకుడు అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్‌ అన్నపరెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ‘నమో రే’ సాంగ్‌కు జునైద్‌ కుమార్‌, అభే అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. శ్రీహర్ష ఈమని లిరిక్స్‌లో భక్తి భావం అద్భుతంగా వినిపిస్తుంది. గాయకులు సింధుజా శ్రీనివాసన్‌, ఐశ్వర్య దారూరి పాడిన విధానం పాటకు మరింత బలాన్ని ఇచ్చింది.

ఈ సాంగ్‌లో మరో పెద్ద ఆకర్షణ మ్యాసీవ్‌ కొరియోగ్రఫీ. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేశ్‌ ఆచార్య, శ్రష్టి వర్మ నేతృత్వంలో దాదాపు రెండు వేల మందికి పైగా డ్యాన్సర్లు వివిధ భారతీయ నృత్యాలతో అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌ ఇచ్చారు. హీరోయిన్లు నభా నటేశ్‌, దక్ష నాగార్కర్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌తో సాంగ్‌ను మరింత గ్రాండ్‌గా మార్చారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ అశోక్‌ కుమార్‌ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అచ్చంగా గుర్తుకు వచ్చేలా ఒక అద్భుతమైన సెట్‌ రూపొందించారు. ఈ సమ్మర్‌లో ఈ సినిమా గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -