- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నార్సింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్య చేశాడో కామాంధుడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ బాలికను నమ్మించాడు. ఆ తర్వాత లైంగికదాడి చేసి ప్రాణాలు తీశాడు. చిన్నారి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో బాలికను కామాంధుడు తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించి.. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
- Advertisement -



