- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గండిపేట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఇబ్రహీంబాగ్, లంగర్‌హౌస్ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు చేపలు పట్టేందుకు చెరువులోకి సోమవారం ఉదయం వెళ్లారు. అందులో ముగ్గురు నీటిలో మునిగిపోగా.. మరో వ్యక్తి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. మృతులను కార్తిక్ (25), గోవర్ధన్ (23), వెంకటేశ్(25)లుగా గుర్తించారు.
- Advertisement -



