నవతెలంగాణ- ఆర్మూర్
ఆర్థిక అభివృద్ధి సాధనలో మహిళలను భాగస్వామ్యం చేయడమే ఎలీప్ లక్ష్యమని ఫీల్డ్ మేనేజర్ భరత్ రెడ్డి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ లు అన్నారు. మండలంలోని గోవింద్ పెట్ గ్రామంలో సోమవారం మహిళలు, మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రాజెక్ట్ ప్రతినిధులు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలీప్ (. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎం టర్వ్యూనర్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు నిధులతో ర్యాంపు (రైజింగ్ అండ్ యాక్సిడెంట్ ఎమ్ఎస్ఎమ్ఈ పెర్ఫార్మెన్స్) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మహిళా సంఘాలకు, మహిళలకు ఉచితంగా 15 రోజుల కుట్టు శిక్షణ ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
శిక్షణ అనంతరం తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అమలు చేసే పథకాలను అందుబాటులోకి తేవడంతో సహాయ పడుతుందని, పారిశ్రామిక రంగంలో సుస్థిరత సాధించే వరకు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునే వరకు వారికి ప్రోత్సాహం కల్పిస్తూ తగిన మద్దతునిస్తుందని, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి సాధనలో మహిళలను భాగస్వాములను చేయాలని అలీఫ్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం భూమేశ్వర్ గౌడ్, ఐకెపి భావన, గ్రామ సర్పంచ్ అప్పల గణేష్, ఉపసర్పంచ్ దార్ల సుశీల్ కుమార్, మాస్టర్ కత్రాజి ముత్తెన్న, ట్రేైనర్ సంతోషిని ,మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



