నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్-యూఎస్-ఇజ్రాయిల్ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా కకావికలమవుతుంది. మూడు దేశాల మధ్య రెండు వారాలపైగా కొనసాగుతున్న యుద్ధంలో క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో గల్ప్ దేశాల్లో పరోక్ష యుద్ధం కాస్తా ప్రత్యేక్ష యుద్ధాన్ని తలపిస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దుబాయ్ లోని ఫుజైరా చమురు పరిశ్రమ జోన్లో డ్రోన్ దాడి జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని జరగలేదని ఫుజైరా ప్రభుత్వ మీడియా కార్యాలయం మంగళవారం తెలిపింది.
మరోవైపు గల్ఫ్ దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలతో పాటు పలు దౌత్య కార్యాలయాలనే లక్ష్యంగా ఇరాన్ ప్రతీదాడులు చేస్తుంది. తాజాగా యూఏఈలోని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నాలుగు డ్రోన్లు దాడికి జరిగాయి. ఈ ఘటనలో దౌత్య భవనం తీవ్రంగా దెబ్బతింది.



