- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో దోమల నివారణకు మురికి కాలువలు శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లామని కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. గ్రామంలోని అన్ని వీధులలో మూరికి కాలువలను శుభ్రం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని సహాయం అందించారని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడం తన లక్ష్యమని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ , జీపీ కార్యవర్గ సభ్యులు , గ్రామ సెక్రెటరీ , గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



