Tuesday, March 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ నుంచి ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు

ఇరాన్ నుంచి ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్‌ నుంచి సుమారు 45 మంది భారతీయ విద్యార్థుల రెండో బృందం ఎట్టకేలకు ఢిల్లీ చేరుకుంది. ఇరాన్ నుంచి అర్మేనియా, అక్కడి నుండి దుబాయ్ మీదుగా సాగిన వీరి ప్రయాణం ఎన్నో మలుపులు, భయాల మధ్య సాగింది. ఉర్మియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న లబీబ్ ఖాద్రీ అనే విద్యార్థి, బాంబుల మోతతో నగరం దద్దరిల్లుతుంటే, రెండు వారాల పాటు హాస్టల్ బేస్‌మెంట్‌లోనే బందీలుగా బతికామని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూశామని తెలిపారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వద్ద కన్నీటితో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు తమ బిడ్డలను చూసి ఆనందబాష్పాలు రాల్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -