Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భగీరథ ఆపరేటర్లకు అందని వేతనాలు.!

భగీరథ ఆపరేటర్లకు అందని వేతనాలు.!

- Advertisement -

ఏడు నెలలుగా పెండింగ్..
ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వైనం
నవతెలంగాణ – మల్హర్ రావు

మంచినీటిని సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మిషన్ భగీ రథ ఆపరేటర్లకు కాంట్రాక్టు కంపెనీ ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. మూడు సంవత్సరాలుగా సరిగా వేతనాలు చెల్లించడం లేదని సదరు కంపెనీ తీరుపై ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదనే సాకు చూపుతున్న కాంట్రాక్టు కంపెనీలు ఆపరేటర్లకు వేతనాలు చెల్లించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ పరిస్థితి..
మిషన్ భగీరథ పంప్ హౌస్లు, సంప్ హౌస్లు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. కేవలం నీటి సరఫరా,అజమాయిషీ చేసే బాధ్యతను గత ప్రభుత్వం కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు పొందిన కంపెనీలు ఆపరేటర్లు, సూపర్వైజర్లను నియమించుకుని వారి ద్వారా ఇంటింటికి రోజూ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. భూపాలపల్లి జిల్లాలో 200 మంది వరకు పని చేస్తున్నారు. ఆపరేటర్లకు సీనియారిటీని బట్టి రూ.8వేల నుంచి రూ.10వేల వరకు, సూపర్ వైజర్లకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. పీఎఫ్ను కూడా జమ చేయాల్సి ఉంది.

పీఎ ఫ్ ను జమ చేస్తున్నా వేతనాల విషయంలో మాత్రం మొదటి నుంచి నిర్లక్ష్యమే జరుగుతోంది.నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులతో సంబంధం లేకుండానే కంపెనీలు తమతో ఒప్పందం చేసుకున్న ఆపరేటర్లకు ప్రతినెలా వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలి. కానీ ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వ కపోవడంతో రెండు రోజుల కింద ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు.ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి మిషన్ భగీరథ సిబ్బం దికి న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -