Tuesday, March 17, 2026
E-PAPER
Homeబీజినెస్‘షి ద ఛేంజ్’ 2026 సందర్భంగా శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

‘షి ద ఛేంజ్’ 2026 సందర్భంగా శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : స్విగ్గీ (NSE: స్విగ్గీ/BSE: 544285), భారతదేశపు అగ్రశ్రేణి ఆన్-డిమాండ్ కన్వీనియన్స్ ప్లాట్­ఫారం ఇటీవలే, ‘షి ద ఛేంజ్’ 2026 సంచికను క్రొత్త ఢిల్లీలో నిర్వహించింది. ‘ఫ్రమ్ విజన్ టు వెంచర్’ టాగ్­లైన్ కలిగిన ఈ ఫ్లాగ్­షిప్ కార్యక్రమం, భారతదేశపు వంటలు మరియు వ్యాపార పరిస్థితులను పునర్నిర్వచించిన మహిళలను ఘనంగా సత్కరించింది.

ముఖ్య అతిథి, శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, వారితో పాటు శ్రీహర్ష మాజేటి, సహ-సంస్థాపకులు, MD అండ్ గ్రూప్ CEO, స్విగ్గీ, ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ మరియు షెఫ్ ఆఫ్ ద ఇయర్ అనే రెండు విభాగాల్లో, F&B పరిశ్రమకు చెందిన 28 మంది మహిళలను సత్కరించారు. ఈ అవార్డులు వారు చేసిన కృషిని మొదలుకుని శాకపాకాల్లో ఆవిష్కరణ మరియు వ్యాపారపరమైన విజయాలకు గుర్తింపు.

సత్కరింపబడినవారిలో, వైబ్రెంట్ లివింగ్ సంస్థాపకులు శ్రీదేవి జాస్తి ఉన్నారు. తమ ఎంటర్ప్రెన్యూర్ పరమైన కార్యకలాపాల ద్వారా మిస్ జాస్తి, శుభ్రమైన పద్ధతిలో తినటాన్ని ఒక సుస్థిరమైన లైఫ్­స్టైల్ ఛాయిస్­గా మార్చుకునేందుకు ఒక పరిపూర్ణమైన, శాకాహార పోషకాల విషయంలో చక్కని కృషి చేశారు. శాకపాకాల ఆవిష్కరణ మరియు మహిళల ఆధ్వర్యంలోని ఆహారపు వ్యాపారాల కోసం భారతదేశపు అత్యంత డైనమిక్ కూడలిగా నగరానికి ఉన్న గుర్తింపు కొనసాగటాన్ని ఈ గుర్తింపు ప్రత్యేకంగా తెలియచెప్పింది.

భారతదేశపు ఆహారపు పరిశ్రమకు చెందిన మార్గదర్శకులు, ఆవిష్కర్తలు, మరియు దార్శనికులను ఏర్చి కూర్చిన కూటమే షి ద ఛేంజ్. F&B రంగంలో మహిళా వ్యాపారవేత్తలను సశక్తులను చేసేందుకు స్విగ్గీ యొక్క నిబద్ధతను ఇది పరిపుష్టం చేస్తుంది. ప్రస్తుతం స్విగ్గీ ప్లాట్­ఫారంలో 70,000 మహిళలు నడిపే రెస్టారెంట్లు ఉన్నాయి. అంతర్గత అంచనాలను అనుసరించి, ఈ వ్యాపారవేత్తలు దాదాపుగా 4,20,000ల ఉద్యోగాలను సృష్టిస్తున్నారు. ప్రతి రెస్టారెంటు సగటున ఆరుగురు ఉద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -