- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈ నెల 25న బీహార్ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. రాష్ట్రవ్యాప్త బంద్ సందర్భంగా అనేక జిల్లాల్లో విద్యార్థి సంఘాలు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో నిరసనకారులు మరియు పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.పాట్నాతో పాటు పలు జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు.అయితే సివాన్ జిల్లాలో చేపట్టిన విద్యార్థుల ర్యాలీపై ఓ కానిస్టేబుల్ ఏకే-47తో కాల్పులు జరిపారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీస్ శాఖపై విమర్శలు వెలువెత్తాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు సదురు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.
- Advertisement -


