Wednesday, March 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రజలందరికి పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు

ప్రజలందరికి పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు

- Advertisement -

టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

నవతెలంగాణ కంఠేశ్వర్ 

తెలుగు ప్రజల ఆత్మీయ పండుగ అయిన ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాది ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించారు. ఉగాది కొత్త ఆరంభాలకు ప్రతీక అని పేర్కొన్న ఆయన, ప్రతి కుటుంబం సుఖశాంతులతో, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సమిష్టి నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రతి వర్గానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.రైతులు, మహిళలు, యువతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉగాది పండుగ మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబమని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే గొప్ప సందర్భమని అన్నారు.ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కొత్త లక్ష్యాలతో ముందుకు సాగి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, ప్రజల సహకారంతో తెలంగాణను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరుకున్నారు. ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని ఆకాంక్షిస్తూ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -