నవతెలంగాణ – జుక్కల్
బీదర్ నుండి జుక్కల్ కు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ కర్ణాటక డిఎంను జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ “బీదర్ నుండి జుక్కల్ మరియు జుక్కల్ నుండి బీదర్ రెండు ట్రిప్పులు బస్సు సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందించారు.
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన జుక్కల్ గ్రామ ప్రజలందరికీ రవాణా ఇబ్బందులు తగ్గుతాయని, వ్యాపార సంబంధాలు పెరుగుతాయని తెలపడం జరిగింది.”(జుక్కల్ నుండి దోస్పల్లి, సోపూర్, చింతాకి, వడగావ్, కరంజి బీదర్)వరకు బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా సమాచారం పొందుటకు, వ్యవసాయ రంగం నుండి వచ్చే వ్యాపారం వృద్ది చెందుతుంది ఆశాభావం వ్యక్తం చేస్తూన్నుమని పేర్కొన్నారు. ఇట్టి వినతి పత్రాన్ని జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ , మాజీ సర్పంచ్ బొంపెలి రాములు సెట్ , కలిసి హుస్సేని బీదర్ డిఎం ఇవ్వడం జరిగింది.



