– క్యాంపు కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం పూజా
– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : వచ్చే ఏడాది అంతా ప్రజలందరికీ శుభం జరగాలని ఉగాది పర్వదినం సందర్భంగా కోరుకున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణము పూజా కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పరాభవం అంటే ఆందోళన ఏమి లేదు శివపార్వతులు అమ్మవారు ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందన్నారు. అందరం కోపాన్ని,అహంకారాన్ని , ఆవేశాన్ని,ఆక్రోశాన్ని ఇతరుల మీద ఈర్ష అసూయలు తొలగించితే అందరం సంతోషంగా ఉంటామన్నారు. నాకు కూడా కోపం రాకుండా ఆవేశం రాకుండా భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమము ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అంత మంచి జరగాలని, అందులో హుస్నాబాద్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని వేడుకునట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా ప్రతిపక్ష నాయకులు కూడా అభివృద్ధికి సహకరించి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. హుస్నాబాద్ లో దేవాలయాల అభివృద్ధి చేసుకునే కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్ లు ,మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ,వైస్ చైర్మన్ బంక చందు ,సర్పంచ్ లు , ఇతర ముఖ్య నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏడాదంతా అందరికీ శుభం కలగాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



