- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. కే టి ఆర్
కి ఉగాది శుభాకాంక్షలు గణేష్ బిగాల తెలియజేశారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించి, కొత్త సంవత్సరానికి సంబంధించిన శుభ ఫలితాలను వివరించారు. గణేష్ బిగాల మాట్లాడుతూ… ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి, ఈ కొత్త సంవత్సరం అందరికీ సుభిక్షం, సంతోషం తీసుకురావాలని ఆకాంక్షించారు.
- Advertisement -



