Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరు కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలి

ప్రతి ఒక్కరు కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలి

- Advertisement -

జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ ఏ. సునీల్ కుమార్
నవతెలంగాణ – కాటారం 

కాటారం మండలం, గంగారం గ్రామపంచాయతీలో శుక్రవారం ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ ఏ. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగారం గ్రామంలో ఎక్కువ కుటుంబాలు కూరగాయల సాగుపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. కూరగాయల సాగు తక్కువ కాలంలో ఆదాయం అందించే లాభదాయక పంటగా నిలుస్తుందని, సరైన ప్రణాళికతో సాగు చేస్తే అధిక లాభాలు సాధించవచ్చని సూచించారు.

సీజన్‌కు అనుగుణంగా సరైన రకాల ఎంపిక, నాణ్యమైన విత్తనాల వినియోగం, సమతుల్య ఎరువుల వినియోగం, తగిన నీటి నిర్వహణ, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా దిగుబడి, నాణ్యతను పెంచుకోవచ్చని రైతులకు వివరించారు. అదేవిధంగా ఇంటి వద్ద చిన్న స్థాయిలో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కుటుంబానికి పోషకాహారం అందడమే కాకుండా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.

కూరగాయల పంటల్లో వచ్చే చీడపీడలు, వ్యాధులను ముందుగానే గుర్తించి సమగ్ర కీటక నియంత్రణ (IPM) పద్ధతులు అమలు చేస్తే ఖర్చు తగ్గి మంచి దిగుబడులు సాధ్యమవుతాయని రైతులకు సూచించారు. అదేవిధంగా ఉద్యాన శాఖ అమలు చేస్తున్న పథకాల గురించి వివరించి, ముఖ్యంగా కూరగాయల సాగుకు అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా కూరగాయల పందిరి నిర్మాణానికి ప్రోత్సాహకాలు అందజేయడంతో పాటు ఉచిత కూరగాయల మినీ కిట్లను గ్రామ సర్పంచ్ గారితో కలిసి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యాన విస్తరణాధికారి రాందాస్ గారు, రైతులు , ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -