Friday, March 20, 2026
E-PAPER
Homeఖమ్మంకొబ్బరి అభివృద్ధి బోర్డు తెలంగాణలో ఏర్పాటుపై పార్లమెంటు చర్చ

కొబ్బరి అభివృద్ధి బోర్డు తెలంగాణలో ఏర్పాటుపై పార్లమెంటు చర్చ

- Advertisement -

– సభలో లేవనెత్తిన ఎంపీ రామసహాయం కు కృతజ్ఞతలు 
– రైతు సంఘం తీర్మానం 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

కొబ్బరి బోర్డు సేవలు తెలంగాణ లోని రైతులందరికీ అందాలని కొబ్బరి రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. అశ్వారావుపేటలోని కాసాని గార్డెన్ లోని పద్మశేఖర్ కొబ్బరి క్షేత్రంలో కె.పుల్లయ్య అధ్యక్షతన కొబ్బరి రైతుల సమావేశం శుక్రవారం నిర్వహించారు.

సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతులకు కొబ్బరి తోటల ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.70 లక్షల విలువచేసే ఎరువులు రావడం హర్షణీయం అన్నారు.అందుకు సహకరించిన కొబ్బరి బోర్డు అధికారులకు అభినం తెలిపారు. 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక కొబ్బరి తోటల్లో దిగుబడుల పెంపునకు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల కొబ్బరి రైతులకు ఎరువులు రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. తోటలు చేసుకున్న ప్రతి రైతుకు లబ్ధి చేకూరాలని ఆకాంక్షించారు. ఏడేళ్ల లోపు తోటలకూ కొబ్బరి పథకాలు అందజేయాలని కోరారు. ఇచ్చిన ఎరువులు మన తోటల్లో దిగుబడులు పెరిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. 

అనంతరం జాతీయ కొబ్బరి బోర్డు రిజినల్  ఆఫీస్  తెలంగాణ లో ఏర్పాటు చేయాలి అని పార్లమెంట్ లో అడిగిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రామిరెడ్డి కి ధన్యవాదములు తెలుపుతూ తీర్మానం చేసారు. సమావేశంలో తలసిల ప్రసాదు, తుంబూరు మహేశ్వరరెడ్డి, కాసాని పద్మశేఖర్, నున్నా కృష్ణారావు పాల్గొన్నారు.

జాతీయ కోబ్బరి బోర్డు ద్వారా కొబ్బరి తోటలకు ఇచ్చే సబ్సిడీ ఎరువుల కు సంబందించిన కొబ్బరి రైతుల సొసైటీ   భాధ్యులు, క్లస్టర్ భాద్యత తీసుకునే వారి ఎంపిక  రైతులతో సమన్వయం .   సొసైటీ సభ్యత్వం రెవినవల్, సొసైటీ ల రెవిన్యూ వల్ మొదలగు అంశాలు  పై చర్చలు, తీర్మానం చేయడం జరిగింది. గంగారo క్లస్టర్ కి శ్రీ సీమ కుర్తీ వెంకటేశ్వర రావు,అశ్వారావుపేట క్లస్టర్ కి కాసాని నాగ ప్రసాద్,నాయుడు పేట క్లస్టర్ కు రఘు ను భాధ్యులు గా ఎంపిక చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -