మంత్రి పొంగులేటికి సీపీఐ, సర్వోదయ మండలి వినతి
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
రాష్ట్రంలో 1.59వేల ఎకరాల భూదాన భూములు నిరుపయోగంగా ఉన్నాయనీ, అవి భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలని సీపీఐ, తెలంగాణ సర్వోదయ మండలి కోరింది. ఈమేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వాటిని వెంటనే నిరుపేదలకు పంపిణి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ సీపీఐ నాయకులు అజీజ్ పాషా, మాజీ ఎమ్యెల్యే చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్ ఉన్నారు. భూదాన బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞఫ్తి చేశారు.
31 ఎకరాల భూదాన భూములను సామజిక – ఆర్థిక సర్వే చేసి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్న దాదాపు 15వందల మంది ఇండ్లులేని నిరుపేదలకు పట్టాలు పంపిణి చేయాలని వారు కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భూముల్లో కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ భూములను గూడులేని పేదలకు పంపిణీ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూదాన భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం అధీనంలో పెట్టుకోవాలని అఖిల భారత సర్వ సేవా సంఘం చేసిన సిఫార్సుల మేరకు భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి మొత్తం భూదాన భూములను పేదలకు పంపిణి చేయాలనీ వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
భూదాన భూములను పేదలకు పంపిణీ చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



