నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్ల గూడెం గ్రామానికి చెందిన జూకంటి వెంకటయ్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగంలో చేసిన పరిశోధన గ్రంథానికి గాను పీహెచ్డీ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. విశ్వవిద్యాలయ సహ ఆచార్యులు డాక్టర్ ఎం రమణ పర్యవేక్షణలో “ఏ రోల్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ గవర్నెన్స్,రూరల్ డెవలప్మెంట్: ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ” అనే అంశంపై పరిశోధనకు గాను పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది.
నాతాళ్ల గూడెం గ్రామానికి చెందిన రాములు ఐలమ్మల చిన్న కుమారుడు వెంకటయ్య ప్రస్తుతం సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. నాతాళ్ల గూడెం గ్రామం నుంచి పీహెచ్డీ పట్టాను పొందిన తొలి వ్యక్తి ఇతనే కావడం విశేషం. వెంకటయ్య తన విద్యాభ్యాసాన్ని పదవ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వలిగొండ ,ఇంటర్మీడియట్ ప్రగతి జూనియర్ కళాశాల వలిగొండ , బీ ఏ శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల భువనగిరి , పీజీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొనసాగించారు.వెంకటయ్య పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను పొందడం పట్ల కుటుంబ సభ్యులు , గ్రామస్తులు సహచర అధ్యాపకులు,బంధువులు హర్షం వ్యక్తం చేశారు.



