వందమందికిపైగా సైనికులు మృతి
కొలంబియా దక్షిణ అమెజాన్ ప్రాంతంలో ప్రమాదం
ధ్రువీకరించిన కొలంబియా రక్షణమంత్రి సాంచెజ్
బోగోటా: దక్షిణ కొలంబియాలోని పుట్యుమాయో ప్రావిన్స్‌లో కొలంబియా వైమానిక దళానికి చెందిన ‘లాక్ హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సీ-130’ రవాణా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వందమందికిపైగా సైనికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సుమారు 110 మంది ప్రయాణిస్తున్నట్టు స్థానిక మీడియా సంస్థ బ్లూ రేడియో వెల్లడించింది. పెరూ సరిహద్దుకు సమీపంలోని ప్నరీర్టో లెగుయిజామో ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఈ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సరిహద్దు ప్రాంతంలో ప్రమాదం
ఈ విమాన ప్రమాదంపై కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో ఆర్నుల్ఫో సాంచెజ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అమెజాన్ అడవుల మధ్య ఉన్న దక్షిణ సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలను తరలిస్తుండగా ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని మంత్రి తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 80 నుంచి 110 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విమానం కూలిన ప్రదేశం పట్టణ కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
”ఇది అత్యంత బాధాకరమైన సమయం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.” అని మంత్రి సాంచెజ్ అన్నారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాద వార్త తెలిసిన వెంటనే సైనిక విభాగాలు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం మంటల్లో పూర్తిగా కాలిపోయినట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత నెలలో కూడా ఇలాంటిదే హెర్క్యులస్ విమానం బొలీవియాలో కూలి 20 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.
కూలిన యుద్ధ విమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



