Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తులతో కిటకిటలాడిన సలబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయం

భక్తులతో కిటకిటలాడిన సలబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో ఉన్న సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం పాదయాత్రగా ఆంజనేయ స్వామి స్వాములు, భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా సాయి పటేల్, మద్నూర్ స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, కల్లాలి సర్పంచ్ రమేష్ దేశాయ్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.

అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో సామూహిక మహాపాదయాత్ర హనుమాన్ దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామి ప్రారంభించారు. అన్నదాత కులకర్ని రమేశ్ దేశాయ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వందలాదిగా తరలివచ్చిన ఆంజనేయ స్వాములకు, భక్తులకు ఆలయ ఆవరణంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -