నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆప్(AAP) నేతలు ఆందోళన చేపట్టారు. గ్యాస్ కొరతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ సీఎం ఆతిష్ ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అమెరికాతో పూర్తిగా రాజీపడ్డారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వారి(బీజేపీ) ప్రణాళిక ఏమిటో ఇప్పుడు అర్థమైందని, సిలిండర్లను పూర్తిగా మాయం చేసి, తద్వారా ప్రతిదీ ఉచితం చేయడమేనని, భారతదేశంలో అయినా, ఢిల్లీలో అయినా ప్రభుత్వాన్ని ఎలా నడపాలో బీజేపీకి తెలియదని ఎద్దేవా చేశారు.. ఈ రోజు, ఢిల్లీ ప్రజలు బీజేపీతో విసిగిపోయారని మీడియా ముందు వాపోయారు.
ప్రభుత్వాన్ని ఎలా నడపాలో బీజేపీకి తెలియదు: ఆప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


