Wednesday, March 25, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్‌నాథ్ సింగ్ అధ్య‌క్ష‌త‌న ఆల్ పార్టీ మీటింగ్

రాజ్‌నాథ్ సింగ్ అధ్య‌క్ష‌త‌న ఆల్ పార్టీ మీటింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప‌శ్చిమాసియా యుద్ధంతో దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులపై చ‌ర్చించ‌డానికి ఇవాళ సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి కేంద్ర‌ ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్య‌క్ష వ‌హించ‌నున్నారు. హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పలువురు ఇతర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరణ ఇవ్వనున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణ నాలుగో వారంలోకి ప్రవేశించగా, హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడింది. ఈక్ర‌మంలోనే ఐదు రోజులు యుద్ధానికి ట్రంప్ బ్రేక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. మ‌రో వైపు ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ పై దాడులు కొన‌సాగిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -