నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ జిపి పార్లమెంట్ గ్రామాలకు శనివారం తై బజార్ వేలంపాట గ్రామ సర్పంచ్ సావిత్ర సాయి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించామని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ వేలంపాటలో ఆశావహులు చాలా మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో వారంతపు సంతను రూ. 3 లక్షల 25వేలకు జావేద్ దక్కించుకున్నారు. అదేవిధంగా రోజువారి సంతను గజుగౌడ్ రూ.1,62,000లకు దక్కించుకున్నారు. వేలంపాటను పంచాయతీ నిబంధనల ప్రకారం తై బజార్ కు రూ.70 వేలు, రోజు వారి సంతకు రూ.50 వేలు డిపాజిట్లు కట్టిన వారికి ఇందులో పాల్గొనే అవకాశం కల్పించారు. వేలంపాటను దక్కించుకున్న వారు నియమ నిబంధనల ప్రకారం డిపాజిట్లు, గ్రామపంచాయతీ కట్టాల్సిన నగదును 9 కిస్తులుగా మార్చి-డిసెంబర్ 25 వరకు తప్పకుండా కట్టాలని కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్ర సాయి గౌడ్ తో పాటు ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ తై బజార్ వేలంపాట పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



