- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంటాలి గ్రామంలో ఉపాధి హామీ పనులను కూలీల సంఖ్య పెంచాలని గ్రామ సర్పంచ్ నాగ్ నాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం పని ప్రదేశంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. కూలీలతో మాట్లాడుతూ ఉదయం పూట తొందరగా పనులకు రావాలని ఎండ పూట పనులు చేయవద్దని ఎండలు బాగా పెరిగాయని కూలీలకు సూచించారు. నిబంధనల ప్రకారం పని చేసిన వారికి పని మొత్తానికి కూలీ డబ్బులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ , జిపి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



