Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ తై బజార్ మళ్ళీ ఆవార్ వార్ హనుమాన్లుదే

మద్నూర్ తై బజార్ మళ్ళీ ఆవార్ వార్ హనుమాన్లుదే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ తై బజార్ వేలం పాట శనివారం గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అధ్యక్షతన జీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేలంపాటలో తై బజార్ ను గతేడాది లాగానే ఈ ఏడాది కూడా అవార్ వార్ హనుమాన్లు రూ.18 లక్షల 63 వేలకు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.17 లక్షల 50 వేల ఐదు వందలు పలకగా ఈ ఏడాది పంచాయతీకి ఒక లక్ష రూ.12,500 అదనంగా సమకూరాయి తై బజార్ వేలం పాటలో రూ.50వేల డిపాజిట్ చెల్లించి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -