రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని న్యాయవాది వినోద్ హిందుస్తానీ ఫిర్యాదు
నవతెలంగాణ -భువనగిరి కలెక్టరేట్
వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చూపు కోల్పోయిన బాలుడికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ హై కోర్టు న్యాయవాది వినోద్ హిందూస్థానీ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ శనివారం కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా న్యాయవాది వినోద్ హిందూస్థానీ మాట్లాడుతూ పసివాడు శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారని, మునిసిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మండిపడ్డారు. విధి నిర్వహణలో విఫలమైన భువనగిరి మున్సిపల్ అధికారులపై తక్షణమే శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నారికి అవసరమైన అత్యుత్తమ వైద్యాన్ని పూర్తి ఉచితంగా ప్రభుత్వ ఖర్చుతోనే అందించాలని హెచ్‌ఆర్‌సీకి సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.
బాలుడిపై వీధి కుక్కల దాడి.. హెచ్‌ఆర్‌సీ లో కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



