Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వే నెంబర్  518 భూములను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

సర్వే నెంబర్  518 భూములను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని రాయగిరి రెవిన్యూ పరిధిలోని వడాయిగూడెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 518 భూ సమస్యపై గత 50 ఏళ్లుగా వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ భూములను ప్రభుత్వం అన్యాయంగా 22-ఏ (నిషిద్ధ జాబితా) లో చేర్చడంపై గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో బొడ్రాయి సెంటర్ వద్ద భారీ గ్రామసభ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ భూదాన్ బోర్డు రికార్డుల ప్రకారం (పేజీ సంఖ్య 175) కేవలం 20 ఎకరాలు మాత్రమే దానంగా ఇవ్వబడిందనీ, రెవెన్యూ అధికారులు ఎటువంటి క్షేత్రస్థాయి విచారణ లేకుండా మొత్తం 467.02 ఎకరాలను భూదాన్ భూమిగా చూపిస్తూ నిషిద్ధ జాబితాలో చేర్చారని ఆరోపించారు.

గ్రామ ప్రజల వద్ద 1954-55 కాస్రా పహానీ, సేత్వార్ రికార్డులు ఉన్నాయని, ఇవన్నీ ఈ భూమి పట్టా భూమి అని నిరూపిస్తున్నాయని, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ఇండ్లు ఉన్న పేద ప్రజలకు,రైతులకు బ్యాంకు రుణాలు అందక,అత్యవసర సమయాల్లో ఆస్తులు అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే వరకు మా పోరాటం ఆగదనారు. ఈ విషయంపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి కి, ఏమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కి వినతి పత్రాలు ఇచ్చామని,  ప్రభుత్వం వెంటనే స్పందించి 22-ఏ నుండి మా పట్టా భూములను తొలగించకపోతే, వందలాది మంది బాధితులతో కలిసి సీసీ ఎల్ ఏ ఆఫీసును,  కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం.” అని  హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్ గౌడ్, ఉపసర్పంచ్ సుక్కల శంకర్ యాదవ్, వార్డు సభ్యులు సుక్కల దుర్గయ్య యాదవ్,  బబ్బూరి సబిత శంకర్ గౌడ్,  పబ్బాల ఉమా రమేష్, కోట దీప జహంగీర్, కోట సుధాకర్, కోట సుధావాణి, మల్లికార్జున్, బబ్బూరి భరత్ గౌడ్, గ్రామ పెద్దలు పబ్బాల ఉప్పలయ్య, బబ్బూరి సురేష్ గౌడ్, బబ్బూరి శంకర్ గౌడ్, సాగర్ గౌడ్, శెట్టి అశోక్ యాదవ్, ముద్దసాని ఆశయ్య, రాములు, ఏశబోయిన శ్రీశైలం, నీల ఆంజనేయులు, ముద్దసాని ఉపేందర్, బండారు స్వామి, గొడ్డేటి యాదగిరి, రాసాల రాజు, నీల చిన్న అంజనేయులు, వల్లాల స్వామి, కోట పోచయ్య, కోట వెంకయ్య, కోట లక్ష్మయ్య, కోట దశరథ, పబ్బాల ఇస్తారి, సుక్కల అశోక్, ఏరబోయిన మల్లేష్, సుక్కల శ్రీశైలం, నోముల శ్రీశైలం లు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -