- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉల్లాస్ పరీక్షలను నిర్వహించినట్లు మెప్మా టీఎంసీ శరణ్య తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రారంభించిన ఉల్లాస్ పథకం ద్వారా వయోజనుల్లో అక్షరాస్యతతో పాటు జీవన, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని తెలిపారు. నిరక్షరాస్యులకు తరగతులు నిర్వహిస్తూ పరీక్షల ద్వారా మూల్యాంకనం చేసి ధ్రువపత్రాలు అందజేస్తున్నామని, ఈ సందర్భంగా 160 మందికి పైగా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



