నేతకాని సేవ ఫౌండేషన్
నవతెలంగాణ – కాటారం
నేతకాని సమాజ అభివృద్ధి కోసం విద్య, వైద్యం, పేద కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా నేతకాని సేవ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని ఫౌండేషన్ అధ్యక్షుడు కుమ్మరి అశోక్, కార్యదర్శి గంట దేవదాస్ తెలిపారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నేతకాని ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన పేద నేతకాని కుటుంబాలకు విద్య, వైద్యం రంగాల్లో ఆర్థిక సహాయ సహకారాలు అందించేందుకు ఫౌండేషన్ కట్టుబడి ఉందన్నారు. యువత విద్యలో ముందుకు రావాలని, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నేతకాని సమాజ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి చేరువ కావడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించి, సమాజానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి దుర్గం సాగర్ బాబు నేత, ఉపాధ్యక్షులు గాలి సడువలి, గోగుల రాజేష్, కార్యదర్శులు బీరెల్లి రాజయ్య, డోంగిరి రవి, సలహాదారులు గంట సమ్మయ్య, కొండగొర్ల రామ్ నారాయణ, ప్రచార కార్యదర్శులు కొండా రామ్, బీరెల్లి మహేష్ తదితరులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, నేతకాని కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



