Monday, March 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమణికొండలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం..

మణికొండలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రిద్ధీస్‌ గ్రాండియర్‌ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లోని వాళ్లంతా భయాందోళనలకు గురయ్యారు. ఫ్లాట్‌లోని వాషింగ్‌ మెషీన్‌కు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన యజమాని తన భార్య, ఇద్దరు పిల్లల్ని వెంటనే బయటకు తీసుకెళ్లడంతో వారికి ప్రమాదం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -