- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ బ్యాట్ పట్టారు. మంజీర బృందానికి కెప్టెన్‌గా తీన్మార్ మల్లన్న, మూసీ రివర్ బృందానికి కెప్టెన్‌గా జి.మధుసూదన్‌రెడ్డి వ్యవహరించారు. మంత్రి వాకిటి శ్రీహరి మంజీర జట్టులో, అజారుద్దీన్ మూసీ రివర్ జట్టులో ఆడారు. చివరి 11 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన దశలో అజారుద్దీన్ రెండు సిక్స్‌లు, ఫోర్లతో మూసీ రివర్ జట్టును గెలిపించారు.
- Advertisement -



