Monday, March 30, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకే అధినేత విజ‌య్ నామినేష‌న్ దాఖ‌లు

టీవీకే అధినేత విజ‌య్ నామినేష‌న్ దాఖ‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఏప్రిల్ 23న త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 234 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒకే ద‌ఫాలో ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గనున్నాయి. మే 4న పోలింగ్ ఫలితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈక్ర‌మంలోనే టీవీకే (త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం) పార్టీ అధినేత విజ‌య్ సోమ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. పెరంబూర్, తూర్పు త్రిచీ అనే రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్ నుంచి పోటీ చేస్తున్న డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.డి. శేఖర్‌పై విజయ్ బరిలోకి దిగుతున్నారు. అలాగే, ట్రిచి ఈస్ట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, డీఎంకే అభ్యర్థి అయిన ఇనిగో ఇరుదయరాజ్‌తో ఆయన పోటీ ప‌డ‌నున్నారు.

ఎన్నిక‌ల్లో భాగంగా ప‌లు పార్టీలు పొత్తుల‌తో బ‌రిలోకి దిగుతున్నాయి. డీఎంకేలో కాంగ్రెస్, డీఎండీకే, వీసీకే కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్డీఏలో బీజేపీ, పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) మిత్రపక్షాలుగా ఉన్నాయి. టీవీకే పోటీతో త‌మిళ‌నాడులో రాబోయే ఎన్నికలు త్రిముఖ పోటీని త‌ల‌పిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -