- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని కంపోస్ట్ షెడ్ ను జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ మండల కేంద్రంలోని వార్డులలో జమ అయిన చెత్తాచెదారని నిత్యం గ్రామపంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్ షెడ్ కు తరలిస్తున్నామని అన్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని పరిశీలించడం జరిగిందని తెలిపారు. కాంప్లెక్స్ షెడ్యూల్ వెళ్లడానికి దారి సుగుమం చేశామని అన్నారు. మొత్తం జమాయే చెత్తచెదారని కాంపోస్ట్ షెడ్యూల్లో జమ చేసి వాటిని ఎరువుగా మార్చాలని గ్రామపంచాయతీ వార్డు సభ్యులు తెలపడంతో పరిశీలించడం జరిగింది అని అన్నారు. ఈ పాల్గొన్నారు జిపి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



