- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 44 TMCల నీరే ఉంది. దీంతో ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి. గత పది నెలల్లో కుడి గట్టులో ఏపీ 2060 మిలియన్ యూనిట్లు, ఎడమ గట్టులో TG 2,725 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు ఈ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలో 2007-08లో 2,544 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది.
- Advertisement -



