Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంఆలయంలో తొక్కిసలాట..ఎనిమిది మంది మృతి

ఆలయంలో తొక్కిసలాట..ఎనిమిది మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నలంద జిల్లాలోని శీతలా మాతా ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.

నలంద జిల్లాలోని మాఘ్రా గ్రామంలో ఈ ఆలయం ఉంది. చైత్రమాసంలో చివరి మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ‘‘ప్రతి మంగళవారం ఇక్కడ రద్దీ నెలకొంటుంది. మేం దర్శనం కోసం పట్నా నుంచి వచ్చాం. కానీ ఉన్నట్టుండి తోపులాట జరగడంతో పలువురు చనిపోయారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది’’ అని మమతాదేవి అనే భక్తురాలు మీడియాకు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయం, ఆస్ప‌త్రి వద్ద విషాదఛాయలు నెలకొన్నాయి. మృతులంతా మహిళలేనని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -