- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని గిద్ద ఉన్నత పాఠశాలలో తెలుగు భాష ఉపాధ్యాయుడు పెరుమల కైలాస్ రచించిన”పద్య రత్నావళి”పద్య కవిత్వ పుస్తకాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో , లయన్ పి ఎం జె ఎఫ్ డాక్టర్ జి మహేందర్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కైలాస్ మాట్లాడుతూ… సమాజాన్ని చైతన్య పరిచే కవిత్వం రావాలని, సమాజానికి దిక్సూచి కావాలని, అందుకు అనుగుణంగా కవులు తమ కవిత్వాన్ని వెలువరించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ళ గోపాల్, లయన్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ అధ్యక్షులు సూర్యనారాయణ రాజు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
- Advertisement -



